సుడిగాలి సుధీర్ తో పాటు కామెడీ స్టార్స్ కొత్త సీజన్లో సందడి చేయనున్న హైపర్ ఆది..?

ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి తెలియని వారంటూ ఉండరు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో కమెడియన్లుగా గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. అప్పటికే మంచి రేటింగ్స్ తో దూసుకుపోతూ ఇండస్ట్రీలోనే టాప్ షో గా గుర్తింపు పొందిన జబర్దస్త్.. ఆది వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. మొదట అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా జాయిన్ అయిన అది అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా ఎదిగి తన పంచులతో, కామెడీ టైమింగ్ తో మొత్తం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఇలా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక టీవీ ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. చాలాకాలంగా అది జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఆదితోపాటు సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ లో కనిపించకపోతే జబర్దస్త్ ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపటం లేదు. అయితే ఆది జబర్దస్త్ లో కనిపించకుండా పోవడానికి గల కారణం గురించి ఇప్పటికి తెలియటం లేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆది గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. తొందర్లోనే ఆది ఈటీవీ నుండి మాటీవీ కి జంప్ అవుతున్నట్లు సమాచారం. ఇంతకాలం మల్లెమాల వారితో అగ్రిమెంట్ ఉండటం వల్ల ఆది ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో చేస్తున్నాడని, మల్లెమాల వారితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ తొందర్లోనే పూర్తయి ఆది మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో సుధీర్ తో పాటు సందడి చేయనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే ఆది కామెడీ స్టార్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే అనసూయ కూడా ఈ షో లో జడ్జ్ గా దర్శనమిచ్చింది. అయితే ఆది గురించి వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే