తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని బయటపెట్టిన సుధీర్..చిత్ర గారు ఏం చేశారో తెలుసా..?

సుడిగాలి సుధీర్ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ ఎంత పాపులర్ అయ్యాడు అందరికీ తెలిసిన విషయమే. సుధీర్ తన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుధీర్ జబర్దస్త్ స్టేజ్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులలో రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఇలా కమెడియన్ గా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. సుధీర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు. సుధీర్ జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని సందేహం లేదు.ఈ మధ్యకాలంలో హైపర్ ఆది, సుధీర్, గెటప్ శీను, అభి వంటి పాపులర్ ఆర్టిస్టులందరూ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేశారు. వీరందరూ సినిమా అవకాశాలు రావడం వల్ల జబర్దస్త్ నుండి బయటకు వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సుధీర్ మాత్రం జబర్దస్త్ మానేసిన తర్వాత మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే షో లో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో సుధీర్ తో పాటు అనసూయ కూడా యాంకర్ గా సందడి చేస్తోంది.

ఇటీవల ఈ సింగింగ్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో చిన్నారులు తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నారు. ఇక సుధీర్ కూడా ఈ షోలో తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని బయటపెట్టాడు. ఇప్పటికే సుధీర్ ఒక హీరో గా, కమెడియన్ గా , యాంకర్ గా కూడా బాగా ఫేమస్ అయ్యాడు. డాన్స్ విషయంలో కూడా సుధీర్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ షో లో సుధీర్ తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా బయటపెట్టాడు. సుధీర్ ఫిమేల్ వాయిస్ తో ప్రముఖ సింగర్ చిత్ర గారిలాపాట పాడటానికి ట్రై చేశాడు. ఈ సందర్భంగా వర్షం సినిమాలోని ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ సాగిపోయే పాటని చిత్ర గారితో కలిసి ఆలపించాడు. దీంతో అక్కడున్న వారందరూ తమ చప్పట్లతో సుధీర్ ని ఎంకరేజ్ చేశారు.