నోరు అదుపులో పెట్టుకో అంటూ నాగబాబుకి వార్నింగ్ ఇచ్చిన సుధీర్ అభిమానులు..?

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి జబర్దస్త్ అవకాశం కల్పించి వారిని స్టార్స్ గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమీడియన్లుగా ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ జడ్జెస్ తో పాటు స్టార్ కమెడియన్లు కూడా జబర్దస్త్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. దానికి కారణం మాత్రం ఇప్పటికి తెలియడం లేదు.

జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన సుధీర్ కూడా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ తాజాగా ఆ ఛానల్ లో ప్రసారం కానున్న పార్టీ లేదా పుష్ప అనే కార్యక్రమంలో కూడా సందడి చేయనున్నాడు. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో సుధీర్ ఎంట్రీ ఇవ్వటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ షో కి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగబాబు గారు ఈ షోలో ఎంట్రీ ఇచ్చినప్పుడు సుధీర్ వెల్కమ్ సార్ అని అంటాడు. అప్పుడు నాగబాబు ఎవరికీ ఎవరు వెల్కం చెబుతున్నారు? రా అని పంచ్ వేస్తాడు.

మరొక సందర్భంలో సుధీర్ ఏడు కోట్లు ఇచ్చాను కదా ఎలాగో విగ్గు పెట్టుకొని రా అని అంటాడు. అప్పుడు నాగబాబు ఇలాంటి పనులు చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా రా ? అని అంటాడు.దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుతారు. నాగబాబు ఈ షో లో సుధీర్ గురించి అన్న మాటలకు ప్రేక్షకులు నవ్వినా కూడా సుధీర్ అభిమానులు మాత్రం నాగబాబు మీద ఫైర్ అవుతున్నారు. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావ్..నీతులు చెప్పే నువ్వు ముందు నువ్వు ఎక్కడినుండి వచ్చావో గుర్తు చూసుకో . ముందు నీ నోరు కంట్రోల్ లో పెట్టుకో..మా సూధీర్ అన్న జోలికి రాకు..’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.