Story Behind Trivikram Srinivas Marriage : త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.?

Story Behind Trivikram Srinivas Marriage

Story Behind Trivikram Srinivas Marriage : మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ అందరికీ సుపరిచితుడు. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, దర్శకుడిగా, స్టార్ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారాయన. గురూజీ అంటూ అంతా ప్రత్యేకమైన గౌరవాన్ని, అభిమానాన్నిచూసిస్తుంటారాయన మీద.

ఇదంతా తెలిసిన సంగతే. ఇంతటి గొప్ప వ్యక్తి అయిన త్రివిక్రమ్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? లెజెండరీ పాటల రచయిత సీతారామశాస్త్రి గారి అన్నయ్య కూతురుని త్రివిక్రమ్ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఆ వివాహం జరిగిన తీరు చాలా విచిత్రంగా వుంటుంది. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, సినిమా సీన్‌ని తలపించేలా వుంటుంది.

సినిమాల్లో పెళ్లి చూపులకు వెళ్లిన హీరో, అక్కను చూడడానికి వెళ్లి చెల్లిని ప్రేమించడం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పటికీ చూస్తూనే వున్నాం. రీల్‌లో ఆ సీన్లు బహుశా, రియల్ లైఫ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లిచూపులు స్పూర్తిగానే పుట్టుకొచ్చాయేమో.

అక్కను చూడడానికి వెళ్లి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెల్లిని ప్రేమించాడు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వాళ్ల వివాహం జరిగింది. విచిత్రంగా లేదూ. వెండి తెర కోసం మాటల మాంత్రికుడే కాదు, మనోడు నిజజీవితంలోనూ ఎంత కళాపోషకుడో చూశారుగా. అదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో బిజీగా వున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. రీసెంట్‌గా రిలీజైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించిన ఘనత త్రివిక్రమ్‌దే.