Trivikram Srinivas: మాటల మాంత్రికుడి కాంబినేషన్లో విజయ్ సినిమా ? నిజమేనా.. ?

Trivikram Srinivas:సెన్సేషన్ నటుడిగా పేరు తెచ్చుకున్న అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పిన తక్కువే. తక్కువ సినిమాలతో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుని ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నాడు ఈ స్టార్ హీరో. గీత గోవిందం లాంటి ఫ్యామిలీ మరియు లవ్ స్టోరీ నేపథ్యంలో ఉన్న సినిమాల్లో సైతం తన ప్రతిభను చాటుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు.

ఇకపోతే ఈ యంగ్ స్టార్ హీరో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో విజయ్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దీని తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీతో జనగణమన అనే మరో సినిమా చేసేందుకు కూడా విజయ్ దేవరకొండ సైన్ చేసినట్లు తెలుస్తుంది. కానీ కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. ఆ మధ్యలోనే ఈ సెన్సేషన్ నటుడు శివ నిర్వాణతో కలిసి లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా సమంత పిక్స్ అయినట్టు టాక్. లైగర్ సినిమాల తర్వాత పలు ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టిన విజయ్ ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇక తాజా వివరాల ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన డైలాగ్ లతో విజయ్ నీ ఆకట్టుకొని తన సినిమాలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. విజయ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతోందా ? అదే నిజమైతే సినీ ప్రేక్షకులకు పండగేనని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.