Venkatesh: వెంకీ మామకు జోడిగా ట్రెండింగ్ హీరోయిన్.. నాలుగోసారి జతకట్టబోతున్న నటి!

Venkatesh: తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్టరీ వెంకటేష్ ను ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు. వెంకీ మామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు వెంకీ మామ. అది జోష్ తో ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల రానా నాయుడు2 సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం వెంకీ మామ తదుపరి సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొత్త సినిమాకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు వెంకటేష్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందునున్న ఆ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించనుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.. కానీ తెర వెనుక మాత్రం పూర్వ నిర్మాణ పనులు చకచక జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే త్రివిక్రమ్ తన గత సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఆ హీరోయిన్ల పాత్రల కోసం హీరోయిన్ త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణి వసంత్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హీరోయిన్లలో ఇప్పటికే త్రిష వెంకీ మామతో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేశ, బాడీగార్డ్ చిత్రాల్లో కలిసి సందడి చేసింది. కాగా ప్రస్తుతం త్రిష చేతిలో విశ్వంభర, కరుప్పు అనే సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత వెంకీ మామ సరసన హీరోయిన్ గా త్రిష నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక పాత్ర కోసం త్రిషని మరొక హీరోయిన్ గా రుక్మిణి పేరును తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే ఇప్పటికే మూడుసార్లు కలిసి నటించిన త్రిష వెంకటేష్ లు ఇప్పుడు ఈ సినిమాతో నాలుగో జతకట్టనున్నారు.