ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన కసరత్తు మొదలైంది. మొదట పార్లమెంట్ స్థానాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని అనుకున్నారు, అరకు అతి పెద్ద పార్లమెంట్ స్థానం కాబట్టి దానిని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాలనీ అనుకున్నారు, కానీ 26 కాకుండా 32 జిల్లాలుగా విభజిస్తున్నట్లు ఇప్పటికే దానిని సంబంధించిన విధివిధానాలు రూపొందించినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 26 నుండి కొత్త జిలాల్లో పరిపాలన సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే కొత్త జిల్లాల ఏర్పాటు పై మొదట వైసీపీ నేతలే అభ్యంతరాలు చెప్పిన కానీ, సీఎం జగన్ ఈ విషయంలో ఎవరు కలగజేచుకోవటానికి లేదని తెగేసి చెప్పటంతో ఆయా నేతలు సైలెంట్ అయ్యారు. ఇక టీడీపీ ఎలాగూ వ్యతిరేకిస్తుంది అది సహజమే.. అయితే తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే కొత్త జిల్లాల విభజన ఆపేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారట.
ఇప్పుడు ఆ లేఖ సంచలనంగా మారిపోతుంది. ఎన్నికల తర్వాత విభజన జరిగితే అనేక సమస్యలు రావచ్చు, జెడ్పి చైర్ పర్సన్ విషయంలో కావచ్చు, ఒక వేళా మండలాలు కూడా విభజన జరిగితే ఎంపీటీసీ విషయంలో ఇబ్బందులు రావచ్చు, కనుక ఎన్నికల కంటే ముందే విభజన జరగాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరవచ్చు కానీ, అసలు జిల్లాల విభజనను ఆపేయండి అంటూ ఆయన లేఖ రాయటం ఏమిటో అర్ధం కానీ విషయం.
ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య అసలు పొసగటం లేదు. ఎన్నికల కమిషనర్ టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నాడు, ఇలాంటి సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటును ఆపేయండి అంటూ నిమ్మగడ్డ లేఖ రాయటం వెనుక టీడీపీ నేతల హస్తముందని వైసీపీ భావించే అవకాశం లేకపోలేదు..
మీడియాలో ప్రచారంలో ఉన్న జాబితాను పరిశీలిస్తే..
1. పలాస
2. శ్రీకాకుళం
3. పార్వతీపురం
4. విజయనగరం
5. విశాఖపట్నం
6. అరకు
7. అనకాపల్లి
8. కాకినాడ
9. రాజమండ్రి
10. అమలాపురం
11. నర్సాపురం
12. ఏలూరు
13. మచిలీపట్నం
14. విజయవాడ
15. అమరావతి
16. గుంటూరు
17. బాపట్ల
18. నర్సరావుపేట
19. మార్కాపురం
20. ఒంగోలు
21. నెల్లూరు
22. గూడూరు
23. తిరుపతి
24. చిత్తూరు
25. మదనపల్లె
26. హిందూపురం
27. అనంతపురం
28. ఆదోని
29. కర్నూలు
30. నంద్యాల
31. కడప
32. రాజంపేట