మంచు విష్ణుకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిరాలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు గత సినిమా మోసగాళ్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం పుంజుకోలేదు. అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన రామ సత్యనారాయణ విష్ణు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ సత్యనారాయణ మాట్లాడుతూ నేను ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అయ్యానని తెలిపారు.

ఒక్క సినిమాల విషయంలో మాత్రమే నేను మోసపోయానని ఆయన కామెంట్లు చేశారు. నేను వెధవను కాబట్టి నేను మోసపోయానని ఆయన తెలిపారు. నేను కోడి రామకృష్ణ స్కూల్ మేట్ అని ఆయన నుంచి సినిమా అనే జబ్బు అంటుకుందని ఆయన చెప్పుకొచ్చారు. 2003లో నాకు సినిమాను నిర్మించాలన్న ఆలోచన కలిగిందని ఆయన తెలిపారు. రామరాజ్యం అనే సినిమాకు తాను 5 లక్షలు ఇచ్చి సమర్పకుడిగా పేరు వేయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

సమర్పకుడు అంటే నిర్మాతకు సమానం అని నేను అనుకున్నానని అయితే సమర్పకుడు అంటే డబ్బులు పోగొట్టుకునే వ్యక్తి అని తర్వాత తెలిసిందని ఆయన అన్నారు. ఆ సినిమా రిలీజ్ కాలేదని ఆయన పేర్కొన్నారు. 1977లో 15000 రూపాయలు చేతిలో మిగిలిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత 2,000 రూపాయలకు ఉద్యోగంలో చేరానని ఆయన చెప్పుకొచ్చారు. పనిచేసే షోరూం నాదేనని చెప్పుకున్నానని ఆయన తెలిపారు.

ఆ తర్వాత థియేటర్ ను ఓపెన్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఏదో చేద్దామని నాలో తపన ఉండేదని ఆయన తెలిపారు. ఊహ అనే సినిమా ద్వారా మంచి లాభాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. విష్ణుకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని ఆయన కామెంట్లు చేశారు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ డబ్బులు వెనక్కి రాలేదని ఆయన అన్నారు.