ఇండస్ట్రీలో మరో భారీ స్టూడియో నిర్మించబోతున్న స్టార్ ప్రొడ్యూసర్.. త్వరలోనే అధికారిక ప్రకటన?

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజుకి ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు రాజు అందులో మంచి లాభాలు రావడంతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల దిల్ రాజుకి వారసుడు పుట్టడంతో మరొకసారి తండ్రి కావటంతో ఆనందంలో మునిగి పోతున్నారు. ఇదిలా ఉండగా దిల్ రాజు గురించి ఇప్పుడూ ఒక వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు ఒక స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఫిల్మ్ సిటీస్ లో రామోజీ ఫిల్మ్ సిటీ అతి పెద్దది.తర్వాత అన్నపూర్ణ స్టూడియో కూడా ఉంది. వీటిలో సినిమా షూటింగ్ లతో పాటు టీవి సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ వంటివి ఎక్కువగా షూట్ చేస్తుంటారు. తెలుగుతో పాటు హిందీ,తమిళ, మళయాళ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటాయి. ఇలా ఫిల్మ్ స్టూడియోస్ కి ఫుల్ డిమాండ్ ఉండటంతో ఇప్పటికే అల్లు అర్జున్ ఒక చిన్న స్టూడియోని నిర్మిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ క్రమంలో దిల్ రాజు కూడా ఒక పెద్ద ఫిల్మ్ సుడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచన దిల్ రాజు కూతురు హన్షితదని సమాచారం. అందువల్ల దిల్ రాజు శంషాబాద్ కు దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో దిల్ రాజుకు సొంత స్దలంలో స్టూడియో నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని అతి పెద్ద స్టూడియోస్ లో ఒకటిగా తమ స్టూడియో ఉండాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం గురించి తొందర్లోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ బిజిగా ఉనారు.