స్టార్ హీరోయిన్ కు లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులకు సెలబ్రిటీ లు కూడా ఏమి అతీతులు కారు. కొన్నాళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ లో కమిట్మెంట్ లేనిదే అవకాశాలు రావని, ఒకవేళ కమిట్ అయిన కానీ అవకాశాలు ఇవ్వక మోసం చేస్తారని శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు ధ్వజమెత్తారు, కానీ కొన్నాళ్ళకు అది అందరూ మర్చిపోయారు.

ఇప్పుడు తాజాగా నటి అమలా పాల్ లైంగిక వేధింపుల‌కు గుర‌య్యారు. తన మాజీ ప్రియుడు ప‌వీంద‌ర్ త‌న‌ని లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని కేర‌ళ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ప‌వీంద‌ర్‌, అమ‌లాపాల్ కొన్నాళ్ళు ప్రేమించుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు  ఒక‌ప్పుడు స‌న్నిహితంగా ఉన్న ఫొటోల్నీ, వీడియోల‌ను లీక్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ అమ‌లాపాల్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన మాజీ లవర్ … మ‌రో 11మందితో కూడా అమ‌లాపాల్ కి కాల్ చేసి, ఫోన్లో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు అమ‌లాపాల్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కేర‌ళ పోలీసులు… ప‌వీంద‌ర్‌ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మ‌రో 11 మంది కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.