టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆస్తుల విలువ అన్ని కోట్లా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నకు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రష్మిక మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ కు కొత్త సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే. ఐతే సినిమాల ద్వారా రష్మిక మందన్న భారీగనే సంపాదించారని సమాచారం.

రష్మిక మందన్న మొత్తం ఆస్తుల విలువ 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. రష్మికకు బెంగళూరులో సొంతంగా బంగ్లా ఉండగా ఈ బంగ్లా విలువ 6 నుంచి 8 కోట్ల రూపాయలు అని సమాచారం. రష్మిక తండ్రి పెద్ద బిజినెస్ మేన్ కాగా గతంలో ఆయనపై ఐటీ అధికారుల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫలితం రష్మికకు షాకిచ్చింది.

భారీ బడ్జెట్ తో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రష్మికకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు కూడా హిట్టైతే ఆమె క్రేజ్ పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రష్మిక తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రష్మిక తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. రష్మిక త్వరలో పుష్ప ది రూల్ షూటింగ్ లో పాల్గొననున్నారు. పుష్ప ది రూల్ కూడా విజయాన్ని అందుకుంటే రష్మిక దూకుడుకు ఎవరూ బ్రేకులు వెయ్యలేరు. మిడిల్ రేంజ్ హీరోల నుంచి రష్మికకు ఆఫర్లు వస్తున్నా వాటిని రష్మిక రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.