పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్

హీరోయిన్లు సాధారణంగా ముప్పై దాటే వరకు పెళ్లి ఆలోచనకు వెళ్ళరు. పెళ్ళైతే సినిమా అవకాశాలు తగ్గుతాయని హీరోయిన్లు వాళ్ళ పెళ్లి ని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్ళైన కూడా హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది.

ఇదే విషయాన్ని కీర్తి సురేష్ తల్లి మేనక తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. పెళ్లి కొడుకు కీర్తి సురేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ యువ పారిశ్రామికవేత్త అని సమాచారం. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవడం వల్లే ఈ విధంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. దీని పై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు.