విలన్లుగా మారుతున్న స్టార్ హీరోలు.. ఈ కండిషన్ పాటించకపోతే అంతే…!

ఒక సినిమాలో హీరో పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే కొందరు స్టార్ హీరోలు కూడా విలన్లుగా నటించడానికి ఈమధ్యకాలంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న జగపతిబాబు, అరవింద్ వంటి వారు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్లుగా బాగా పాపులర్ అయ్యారు. కానీ ప్రస్తుతం కొంతమంది స్టార్ట్స్ హీరోలుగా సినిమాలు చేస్తూనే మరొక సినిమాలో విలన్ లుగా నటిస్తున్నారు. తమిళ హీరో ఆది పినిశెట్టి కూడా ఒకవైపు హీరోగా మరొకవైపు విలన్ గా రాణిస్తున్నాడు.

ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో కూడా మలయాళీ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ నటించాడు. ఎవ్వరికీ భయపడకుండా దూసుకుపోతున్న పుష్ప స్పీడ్ కి బ్రేక్ లు వేస్తూ ఫహద్‌ ఫాజిల్‌ భన్వర్ సింగ్ షెకావత్ లా వచ్చాడు. ఈ సినిమాలో పుష్పకి భన్వర్ సింగ్ షెకావత్ కి సర్ అనే ఒక మాట దగ్గర వైరం మొదలవుతుంది. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ కి పుష్ప ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్ పుష్ప సినిమాకే హైలైట్ గా నిలిచింది.ఇలా ఒక్క మాట కోసం సినిమాని సీక్వెల్ వరకు తీసుకెళ్లారు.

ఇక ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఇప్పటికే 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య కూడా అతిధి పాత్రలో నటించాడు.ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య కూడా పుష్ప సినిమా లో ఫహద్‌ ఫాజిల్‌ రెస్పెక్ట్ కోరుకున్నాడు. తనవాల్లే తనను పేరు పెట్టీ పిలవటం జీర్ణించుకోలేని రోలెక్స్ తనని రోలెక్స్ సర్ అనండి అంటు పట్టుపట్టాడు. ఇలా విలన్లు గా మారుతున్న హీరోలు హీరోతో సమానంగా తమకి రెస్పెక్ట్ ఉండాలని కొత్త కండీషన్ పెడుతున్నారు.