ఆ హీరోది ఎంత గొప్ప మ‌న‌సు.. అభిమాని పెళ్ళికి వెళ్లి మ‌రీ ఆశీస్సులు అందించాడు

మనం ఎంత ఎత్తుకు ఎదిగామనేది ముఖ్యం కాదు.. ఎంతగా ఎదిగినా మన చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి.. ప్రేమించాలి.. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోలకు వీరాభిమానులు ఉంటారు. అలాంటి వారి బాగోగుల్ని చూస్తుంటారు కొంతమంది హీరోలు.. ఎంత కష్టపడి సినిమా తీసిన ఆదరణ నోచుకోని ప్రేక్షకుడు, అభిమాని లేనప్పుడు ఈ సినిమాకు అర్థం ఉండదు. అలాంటి అభిమానులకు హీరోలు కూడా ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఈ విషయంలో కోలీవుడ్ హీరో సూర్య ఒక అడుగు ముందే ఉంటాడు. తన సినిమాలను ఆదరించే అభిమానులంటే సూర్యకు ఎనలేని అభిమానం. రీసెంట్ గా సూర్య అభిమాని పెళ్ళికి వెళ్ళి సర్ ప్రైజ్ చేసాడు. సూర్య ఆలిండియా వీరాభిమాని.. సూర్య ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడు హరి పెళ్ళికి వెళ్ళి.. పెళ్ళి తంతు దగ్గరుండి మరీ జరిపించడం వధూవరుల కుటుంబ సభ్యుల్ని ఆనందంలో ముంచెత్తింది.

నూతన జంట వివాహ ప్రయాణం ఆనందంగా సాగాలంటూ ఆశీర్వదించాడు. ఇక హరి సంతోషానికైతే అవధులు లేవు. ఇక పెళ్ళి మండపంలో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తన అభిమాని కోసం ఎంతో బిజీ షెడ్యూల్ ని కూడా పక్కన పెట్టి మరీ పెళ్ళికి వెళ్ళి ఆశీర్వదించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సూర్య మొదట్నించి సిప్లిసిటీకి దగ్గరగా ఉంటాడు. అగరం అనే ఫౌండేషన్ తో ఎన్నో సహాయాలు చేస్తుంటాడు హీరో సూర్య.

రీసెంట్ గా ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆకాశం నీ హద్దురా సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు సూర్య. ఈ సినిమాని సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం సూర్య గౌతమ్ మీనన్ షార్ట్ ఫిల్మ్ నవరసలో సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు డైరెక్ట్ చేస్తున్న ఈ కథలకు ఏ ఒక్కరూ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం విశేషం. ఓటీటీలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ప్రాఫిట్స్ ని పదివేల మంది కార్మికులకు పంచి పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా హీరో సూర్య తన అభిమానుల కోసం ఏదైనా చేస్తారనే విషయం మరోసారి రుజువైందని అంటున్నారు నెటిజన్లు.