అభిమానులకు ఆశ్చర్యం కలిగించే ప్రభాస్ ఖాతాలో ఉన్న రికార్డులు తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్, ఇతర దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఒక విధంగా ప్రభాస్ రేంజ్ ను మార్చేశాయని చెప్పాలి. ప్రభాస్ సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో బాహుబలి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. బాహుబలి2 సృష్టించిన సంచలన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డులు చాలా భాషల్లో ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా 9000 కంటే ఎక్కువ థియేటర్లలో అప్పట్లో విడుదలైంది.

బాహుబలి2 సినిమాకు ముందు ఈ స్థాయిలో మరే సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్లు సాధించిన మరో సినిమా లేదని సమాచారం అందుతోంది. బుక్ మై షో వెబ్ సైట్లో రిలీజ్ కు ముందు నిమిషానికి 5 టికెట్ల చొప్పున బుకింగ్ అయిన సినిమాగా బాహుబలి2 నిలవడం గమనార్హం.

ఈ సినిమా టికెట్లు 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముడవడం గమనార్హం. టికెట్లు దొరకక అభిమానులు ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సినిమాకు 215 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్టైనా కేరళలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు. ఈ సినిమా 50 రోజులు 1050 కేంద్రాలలో ఆడింది. ఈ రికార్డ్ భవిష్యత్తులో కూడా బ్రేక్ కావడం సాధ్యం కాదు. తెలుగులో ఈ సినిమాకు 510 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని బోగట్టా. ఈ విధంగా ప్రభాస్ ఒక్క సినిమాతోనే కళ్లు చెదిరే రికార్డులను ఖాతాలో వేసుకున్నారు.