అక్కినేని హీరో నాగార్జున తొలి రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్, యువసామ్రాట్ లాంటి బిరుదుల ద్వారా అక్కినేని నాగార్జున పాపులర్ అయ్యారు. అటు క్లాస్ రోల్స్ లో నటించినా ఇటు మాస్ రోల్స్ లో నాగ్ తన నటనతో మెప్పించగల ప్రతిభను కలిగి ఉన్నారు. నాగ్ ప్రయోగాత్మక కథలతో పాటు కొత్త డైరెక్టర్లకు కూడా పెద్ద పీట వేస్తారనే సంగతి తెలిసిందే. టాలెంట్ ఉంటే నాగార్జున కచ్చితంగా ఛాన్స్ ఇస్తారని చాలామంది దర్శకులు భావిస్తారు.

ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి తనకు మాత్రమే సొంతమైన టైమింగ్ తో నాగార్జున విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న నాగ్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి. నాగ్ హీరోగా నటించి సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడంతో పాటు నాగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

బంగార్రాజు తరహా పాత్రలకు నాగార్జున కాకుండా మరే స్టార్ హీరో సూట్ కారని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం నాగార్జున ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే నాగార్జున తొలి రెమ్యునరేషన్ మాత్రం 3 లక్షల రూపాయలు కావడం గమనార్హం. విక్రమ్ సినిమా కోసం నాగార్జున ఈ మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు.

1986 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాతో నాగార్జున సినీ కెరీర్ మొదలైంది. మధుసూధనరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కెరీర్ తొలినాళ్లలో ఒడిదొడుకులను ఎదుర్కొన్న నాగార్జున తర్వాత కాలంలో వరుస విజయాలతో సత్తా చాటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.