సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ హీరోలు ఎక్స్పరిమెంట్ లు ఎక్కువగా చెయ్యరు. మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలు పక్క కమర్షియల్ ఫార్మటు కి బయట వెళ్లారు. అలా ప్రతి సినిమాకు వేరియేషన్ చూపించేవాళ్ళల్లో కమల్ హాసన్, విక్రమ్ ఉంటారు. అయితే వీళ్ళకి సక్సెస్ అందని ద్రాక్షలా మారింది ఇప్పుడు. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కి ‘విక్రమ్’ సినిమాతో తో భారీ హిట్ అందింది. మరో పక్క విక్రమ్ కి ‘అపరిచితుడు’ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా లేదు.
ఈ జనరేషన్ హీరోల్లో విక్రమ్ చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు. విక్రమ్ వేసినన్ని గెటప్పులూ ఎవరూ వేయలేదు. అపరిచితుడు తనని స్టార్‌గా మార్చేసింది. ‘సేతు’, ‘జెమినీ’, ‘స్వామి’ లాంటి హిట్స్ తర్వాత ‘అపరిచితుడు’ సినిమాతో ఒక్కసారిగా విక్రమ్ పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ, ఆ సినిమా తర్వాత అస్సలు సమయస వచ్చింది.
ఆ తరవాత హిట్టు కొట్టడానికి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాడు విక్రమ్. గత పదిహేడు సంవత్సరాల్లో విక్రమ్ నుంచి ఒక్క హిట్ కూడా పడలేదు. కథ కంటే గెటప్పుల్నే ఎక్కువ నమ్ముకోవడం, ప్రయోగాలలో `అతి`… ఇవన్నీ విక్రమ్ కెరీర్ ను ముంచేసాయి.
తన ప్రతి సినిమాలోనూ కనీసం రెండు మూడు గెటప్పుల్లో కనిపించడం అలవాటైపోయింది. గెటప్పులపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్డడం లేదన్న విమర్శను ఎదుర్కొంటూనే వచ్చాడు విక్రమ్. ఇప్పుడు విక్రమ్మ కొత్త సినిమా వస్తోంది. అదే.. `కోబ్రా`. ఇందులోనూ గెటప్పుల గోలే. ఈసారి ఏడెనిమిది వేషాల్లో కనిపించదు విక్రమ్. ట్రైలర్ కట్ చేస్తే… ఆ ట్రైలర్ అంతా.. విక్రమ్ వేసిన గెటప్పుల్ని చూపించడానికే సరిపోయింది.
ఏ హీరో అయినా కొత్త గెట్ అప్ వేస్తే వెరైటీ…కానీ వెరైటీ అనే పదం విక్రమ్ కి రొటీన్ గా అయిపోయింది. ఇప్పటికే విక్రమ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఒకప్పుడు తెలుగు లో స్టార్ హీరోలతో సమానంగా విక్రమ్ కి మార్కెట్ ఉండేది. ఇప్పుడు కనీసం విక్రమ్ సినిమా వచ్చి, వెళ్లినట్టు కూడా ఎవరికీ తెలియట్లేదు. ఈసారి ‘కోబ్రా’ తో ప్లాప్ ఇంకెప్పుడూ గెటప్పుల జోలికి పోడేమో…? హిట్టయితే గనుక.. ఇక ప్రతీసారీ ఈ టార్చర్ తప్పదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.