అల్లు అర్జున్ గంగోత్రి సినిమాకు అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమాలో బన్నీ నటన బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా పుష్ప ది రూల్ సినిమాకు హిందీ నుంచి 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆఫర్లుగా వస్తున్నాయని సమాచారం అందుతోంది.

అయితే అల్లు అర్జున్ తొలి రెమ్యునరేషన్ మాత్రం కేవలం 4 లక్షల రూపాయలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటూ అల్లు అర్జున్ వార్తల్లో నిలుస్తున్నారు. అల్లు అర్జున్ కు క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ఖాతాలో సక్సెస్ చేరిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు సైతం బన్నీతో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. బన్నీ సైతం సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కథల జడ్జిమెంట్ విషయంలో బన్నీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నా పేరు సూర్య ఫ్లాప్ బన్నీ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

వక్కంతం వంశీని నమ్మి బన్నీ ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. బన్నీ జాబితాలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఏ డైరెక్టర్ కు బన్నీ మొదట ఛాన్స్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.