టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ త్రివిక్రమ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలో మహేష్ బాబు సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదలుపెట్టనున్నారు. ఒక్కో సినిమాకు త్రివిక్రమ్ పాతిక కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆలస్యంగా సినిమాలు తీస్తారనే విమర్శ ఉన్నా త్రివిక్రమ్ సినిమాలు అంటే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీలో పేరుంది.
దర్శకుడిగా త్రివిక్రమ్ ఆస్తుల విలువ ఏకంగా 80 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ వేగంగా సినిమాలను తెరకెక్కి్చి ఉంటే ఈ మొత్తం మరింత పెరిగేది. నువ్వేనువ్వే సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్ మినహా మిగతా హీరోలతో త్రివిక్రమ్ సినిమాలను తెరకెక్కించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సినిమాలకు కథనం, మాటలు అందించడం ద్వారా వార్తల్లో నిలిచారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం సినిమా కోసం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేస్తున్నారనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టి పెడితే ఆయన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. త్రివిక్రమ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
త్రివిక్రమ్ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదిగిన దర్శకుడు కావడం గమనార్హం. కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు విజయభాస్కర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి పని చేశారు. అయితే జై చిరంజీవ సినిమా వల్ల వీళ్లిద్దరూ విడిపోవడం జరిగింది. త్రివిక్రమ్ ఆస్తుల విలువ అంతకంతకూ పెరుగుతుండగా వినోదాయ సిత్తం రీమేక్ ద్వారా త్రివిక్రమ్ భార్య నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టనున్నారు.