Radhe Shyam And Bahubali : “రాధే శ్యామ్” కూడా “బాహుబలి” లాంటిదే కానీ..స్టార్ కంపోజర్ కామెంట్స్!

Radhe Shyam And Bahubali

Radhe Shyam And Bahubali : ఓ పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చెయ్యాలి అంటే ఉదాహరణ ప్రభాస్ సినిమాలను చెప్పొచ్చు. బాహుబలి తర్వాత నుంచి తన సినిమాలకు తెలుగు మరియు హిందీ భాషల్లో సహా తమిళ్ లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకొంటూ ప్లాన్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు తెరకెక్కించిన మరో ఇంట్రెస్టింగ్ భారీ సినిమా “రాధే శ్యామ్“.

పాన్ ఇండియా సినిమాగా కావాల్సిన అన్ని జాగ్రత్తలు చాలా కేర్ గా తీసుకున్న ఈ సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంగీతం పరంగా మేకర్స్ పెద్ద నిర్ణయాలే తీసుకున్నారు. హిందీకి ఇద్దరు సౌత్ ఆల్బమ్ కి ఒకరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒకరు ఇలా నాలుగు సంగీత దర్శకులు ఈ సినిమాకి వర్క్ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ ఓ క్రేజీ కామెంట్ చెయ్యడం వైరల్ గా మారింది. రాధే శ్యామ్ కూడా బాహుబలి లాంటిదే అని అయితే బాహుబలి భారీ యుద్ధ నేపథ్య చిత్రం అయితే రాధే శ్యామ్ అంతే భారీ స్థాయి ప్రేమకథా చిత్రం అని పోల్చి చెప్పాడు.

అంటే ఈ లెక్కన రాధే శ్యామ్ సినిమా ఎంత గ్రేట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ వీళ్లంతా చెప్తున్నా మాట ఎంతవరకు నిజమో అనేది ఇంకాసేపట్లో తేలిపోనుంది అని చెప్పాలి. సో అప్పటి వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు.