Bahubali: మరోసారి రిపీట్ కాబోతున్న బాహుబలి కాంబినేషన్… అసలు విషయం బయట పెట్టిన ప్రభాస్!

Bahubali: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 11వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ముఖ్య అతిథిగా రాజమౌళి పాల్గొన్నారు.ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ప్రభాస్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తూ అభిమానులు సందడి చేశారు.రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఇదే కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని అభిమానులు కూడా ఎంతో ఆశపడ్డారు. అయితే ప్రభాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పకుండా జక్కన్న కాంబినేషన్లో తన సినిమా ఉంటుందని వెల్లడించారు.

ఇప్పటికే ఒక చిన్న స్టోరీ ఐడియా పై కథ కూడా సిద్ధం చేశాము. ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయని అయితే ఇద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ చేయడం మాత్రం పక్క అంటూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజమౌళితో ప్రభాస్ చేయబోయే సినిమా గురించి వెల్లడించారు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.