స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది ప్రస్తుతం ఈటీవీలో ఇతర కామెడీ షోలతో కూడా బిజీ అయ్యారు. సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చినా ఆ ఉద్యోగాన్ని వదులుకుని టీవీ రంగంలోకి వచ్చిన ఆది తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగారు. ఆది వేసే స్పాంటేనియస్ పంచ్ ల వల్లే అతనికి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ లాంటి షోలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఆది సత్తా చాటారు.

టీవీ షోల ద్వారా సినిమాల ద్వారా హైపర్ ఆది కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. హైపర్ ఆదికి హైదరాబాద్ లో సొంతంగా ఫ్లాట్ ఉండగా నెలకు 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆదికి రెమ్యునరేషన్ గా దక్కుతోంది. ఆది ఏవైనా ఈవెంట్లలో పాల్గొంటే ఆ ఈవెంట్లకు కూడా భారీ మొత్తం దక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జబర్దస్త్ షోకు వచ్చిన తర్వాత ఆది సొంతూరిలో ఏకంగా 16 ఎకరాల పొలం కొనుగోలు చేశారు.

తన తండ్రికి ఆది ఖరీదైన ఉంగరాలను చేయించారు. కెరీర్ తొలినాళ్లలో ఆది స్కిట్లు బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయన స్కిట్లు అంతగా ఆకట్టుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆస్తుల గురించి జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఆది క్లారిటీ ఇస్తే మాత్రమే వాస్తవాలు తెలుస్తాయనే సంగతి తెలిసిందే. ఆదికి రైటర్ గా కూడా ఎక్కువ సంఖ్యలోనే అవకాశాలు వస్తున్నాయి.

ఢీ షోలో ప్రసారమయ్యే స్పెషల్ స్కిట్లలో ఎక్కువ స్కిట్లు ఆది సొంతంగా రాసిన స్కిట్లే కావడం గమనార్హం. ఆది భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇతర టీవీ ఛానెళ్ల నుంచి ఆదికి ఆఫర్లు వస్తుండగా ఆది ఆ ఆఫర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆది క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.