ఆ హీరో తో శ్రీను వైట్ల నెక్స్ట్ సినిమా

మూవీ ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన కొరటాల శివ ‘ఆచార్య’ లాంటి ఒక్క ప్లాప్ తో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఎన్టీఆర్ తో తన సినిమా ఉంటుందో, లేదో ఇంకా క్లారిటీ లేదు.

ఒకప్పుడు తెలుగు లో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘బాద్షా’, ‘కింగ్’, ‘దూకుడు’, లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల కొంత కాలం గా సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. ఒకప్పుడు శ్రీను వైట్ల తో సినిమా కోసం పోటీ పడ్డ హీరోలు ఇప్పుడు కనీసం అతనికి అప్పొయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.

కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు తో ఢీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు కానీ ఆ సినిమా ఏమైందో తెలియదు. తాజా సమాచారం ప్రకారం స్రీన్ వైట్ల తో సినిమా చెయ్యడానికి గోపీచంద్ ముందుకు వచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ కి కూడా హిట్స్ లేవు, మరీ ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.