ఉక్కు కార్మికుల సహాయంతో పవన్ కళ్యాణ్ కు ఎసరు పెడుతున్న గంటా ..!

ganta srinivas rao

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి తెరమీదకు వచ్చింది. విశాఖ స్టిల్ ప్లాంట్ ను 100 % ప్రవేటీకరణ చేయాలనీ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో విశాఖ నగరం భగ్గుమంటుంది. రాజకీయాలకు అతీతంగా నేతలందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పనిలో పనిగా తమ సొంత ఇమేజ్ ను పెంచుకోవటానికి కూడా ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారు.

ganta srinivas rao

 ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాడు. అందరికంటే ముందే విశాఖ ఉక్కు కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరి దృష్టి ఆకర్షించాడు. గంటా కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసి వచ్చిన వ్య‌క్తే. దీంతో ఈ సెంటిమెంట్‌ను ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ఆయ‌న రాజ‌కీయంగా ఇప్పుడు సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

 ముందుగా రాజీనామా చేసిన గంటా… రెండోసారి స్పీక‌ర్ ఫార్మాట్లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో స్పీక‌ర్ త‌మ్మినేని గంటా రాజీనామాను ఆమోదించ‌డ‌మే మిగిలి ఉంది. దీనితో నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జరగటం అనివార్యం అయ్యింది. అయితే ఇక్కడే గంటా తన తెలివిని ఉపయోగించాడు. నార్త్ లో ఉప ఎన్నిక జరిగితే తాను పోటీచేయనని, విశాఖ ఉక్కు కార్మికుడిని పోటీకి దించుతామని చెప్పటం జరిగింది.

 గంటా ఇలా ప్రకటించటం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తుంది. నిజానికి గంటా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా రెండు సార్లు పోటీచేసిన సందర్భం లేదు. ప్రతి ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో విశాఖ ఉక్కు కార్మికుడికి మద్దతు ఇచ్చి, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ ఉక్కు కార్మికులు ఎక్కువగా ఉండే గాజువాక కు మారిపోవాలనే ఆలోచనలతో గంటా ఉన్నట్లు తెలుస్తుంది.

 పైగా గాజువాకలో కాపు వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువే. పైగా గ‌తంలో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం విజ‌యం సాధించింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే నియోజకవర్గం నుండి పోటీచేయటం జరిగింది. ఇప్పుడు నార్త్ లో ఉక్కు కార్మికుడికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. దానిని క్యాష్ చేసుకుంటూ, తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ గాజువాకకు వెళ్లిపోవటానికి గంటా సిద్దమయ్యాడు అనే టాక్ విశాఖలో వినిపిస్తుంది. మరి గంటా అటు వెళితే పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో..?