Karate Kalyani: శ్రీరెడ్డి బట్టలిప్పి రోడ్ మీద కూర్చుంటే వద్దు అన్నందుకు నా మీద కేసు పెట్టారు.. కరాటే కళ్యాణి!

Karate Kalyani: ఓ ఇంటర్వ్యూలో కలిస్తే పరిచయం అయిందే తప్ప అంతకుమించి వారిమధ్య ఎక్కువ సాన్నిహత్యం లేదని ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి అన్నారు. ఎందుకులే ఇవన్నీ నీ పని నువ్వు చేసుకోకుండా అని ఇలా కొన్ని తనతో అప్పుడు మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఒక రోజు ఒక అమ్మాయి చౌదరి అంట నా మీద లేని పోనివి రాసిపెట్టి యూట్యూబ్‌లో పెట్టిందని శ్రీరెడ్డినే తనకు ఫోన్ చేసి చెప్పిందని ఆమె అన్నారు. అప్పుడు కూడా తాను శ్రీరెడ్డికే సపోర్ట్ చేశాననే, ఆ పోస్ట్ పెట్టిన అమ్మాయినే మందలించానని ఆమె చెప్పారు. ఆడపిల్ల అన్న కారణంగా తనకు మంచి చెప్పానని, కానీ అవేమీ తనకు గుర్తులేవని ఆమె అన్నారు.

ఓ సారి డిబేట్‌లో ఇలా చేస్తావనుకోలేదక్కా అని శ్రీరెడ్డి అన్నదని కరాటే కళ్యాణీ అన్నారు. చాలా సార్లు తమకు నచ్చకపోయినా కొన్ని నచ్చని డ్రెస్సులు వేసుకున్నానని, కానీ తప్పక కేవలం భుక్తి కోసం మాత్రమేనని ఆమె చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం అవన్నీ చేయనని పక్కన పెట్టేశానని ఆమె స్పష్టం చేశారు. ఇకపోతే తనకు మంచి చెప్పాలను చూసినా అది బెడిసికొట్టిందని, తిరిగి తనకే రివర్స్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రోజు శ్రీరెడ్డి నగ్నంగా రోడ్డుపై కూర్చొని అలా చేస్తున్నపుడు అలా చేయొద్దు అని చెప్తే వినలేదని, పైగా అలా చెప్పినందుకు తనపైనే కేసు పెట్టారని ఆమె చెప్పారు. అది తనకు ఇష్టముండి పెట్టిందా, లేదంటే వేరొవరైనా తనతో పెట్టించారా అన్నది మాత్రం తనకు తెలియదని కరాటే కళ్యాణీ అన్నారు. అది మొత్తం అయిపోయాక కూడా శ్రీరెడ్డి ఏడుస్తూ ఉంటే పక్కకు తీసుకెళ్లి ఓదార్చానని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఇక ఆమె ఏం చేసిన దాన్ని తాను వ్యతిరేకించానని ఆమె తెలిపారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం, పేరు రావడం కోసం ఎవరికి నచ్చిన దారిలో వారు వెళతారని, అది వాళ్లిష్టం అని ఆమె అన్నారు. అది తప్పని, లేదంటే తప్పు కాదని మనం డిసైడ్ చేయలేమని కళ్యాణి చెప్పారు.