శ్రీశాంత్.. ఓ ఏడేళ్ల ముందు ఆ పేరు క్రికెట్ చరిత్రలో మారుమోగిపోయింది. టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ను బీసీసీఐ జీవిత కాలం పాటు నిషేధించిన విషయం తెలిసిందే. స్పాట్ ఫక్సింగ్ ఆరోపణలతో ఆయనపై బీసీసీఐ నిషేధం విధించింది.
అయితే.. శ్రీశాంత్.. బీసీసీఐకి చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో… ఆయన నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. దీంతో గత సెప్టెంబర్ 13న పూర్తయింది.
దీంతో మళ్లీ క్రికెట్ స్టేడియంలో శ్రీశాంత్ అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టిన శ్రీశాంత్.. ప్రెసిడెంట్ కప్ టీ20 టోర్నీలో ఆడనున్నాడు. శ్రీశాంత్ ను కేరళ క్రికెట్ అసోషియేషన్ ఈ టోర్నీకి సెలెక్ట్ చేసింది. ఈ టోర్నీ కొచ్చిలో జరగనుంది.
తనను ఈ టోర్నీకి సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి అవకాశం కోసం ఏడేళ్లు ఎదురుచూశానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.