డ్యూటి చేస్తూ రోడ్డుపైన అమ్మాయిలతో.. చేసిన హోంగార్డు (వీడియో)

బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోం గార్డు విధులు నిర్వహిస్తూ తనలోని  వక్రబుద్ది చూపించాడు. కొచ్చిలోని తివారాలో ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, సదరు హోం గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంగార్డు శివకుమార్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కింద ఉంది చూడండి.

ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముసలి వయసుకు చేరుకున్న పోలీస్ అయి ఇదేం బుద్ది అని పలువురు తిట్టారు.

https://www.youtube.com/watch?v=f2_7W7bOt9o