టీడీపీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత కూడా అచ్చెన్నాయుడు వైసీపీపై ఎక్కువగా విరుచుకుపడకుండా చాలా కూల్ గా ఉన్నారు. అలాగే గత కొంతకాలంగా టీడీపీ చేస్తున్న రాజకీయ కార్యక్రమాలకు కూడా అచ్చెన్న కొంచెం దూరంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు తన నియోజక వర్గంలో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక వైసీపీపై యుద్ధానికి సిద్ధమైనట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొన్న జరిగిన టీడీపీ కమీటీ ఏర్పాట్లలో కూడా పెద్దగా పట్టించుకోని అచ్చెన్న ఇప్పుడు వైసీపీని రాష్ట్రం మొత్తం దెబ్బతియ్యడానికి ఉద్యమం చేపట్టనున్నారని సమాచారం.
టెక్కలిలో అచ్చెన్నకు అవమానం
2019 ఎన్నికల్లో వైసీపీ తాకిడికి తట్టుకొని టెక్కలి నియోజక వర్గంలో అచ్చెన్నాయుడు విజయాన్ని సాధించారు. అలాంటి నియోజక వర్గంలో వైసీపీ నేతల నుండి, ప్రభుత్వ అధికారుల నుండి అవమానం జరిగింది. ఎలాగంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కడైతే గెలవలేదో అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఇంచార్జ్ లను నియమించారు. వల్ల ద్వారానే నియోజక వర్గానికి సంబంధించిన అన్ని పనులను చేయిస్తున్నారు. అలాగే ఇప్పుడు టెక్కలిలో కూడావైసీపీ ఇంచార్జ్ దువ్వడా శ్రీనివాసే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా నియోజక వర్గంలో పలు శంకుస్థాపనలను కూడా ఎమ్మెల్యేకు ఆహ్వానం ఇవ్వకుండానే వైసీపీ ఇంచార్జ్ తో ప్రభుత్వ అధికారులు నిర్వహించారు. దీనిపై అచ్చెన్న అసెంబ్లీ కార్యదర్శులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా తన సొంత నియోజకవర్గంలోనే తనకు అవమానం జరగడాన్ని తట్టుకోలేని అచ్చెన్న ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రం మొత్తం ఉద్యమించడానికి సిద్ధం అవుతున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం.
వైసీపీకి దెబ్బపడనుందా!!
2019 ఎన్నికల తరువాత వైసీపీ ఈ ఇంచార్జ్ ల రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ కూడా చేసింది కానీ వైసీపీ ఇప్పుడు హద్దుదాటి ప్రవర్తిస్తుంది. అసలు ఎమ్మెల్యేలను పిలవకుండా నియోజక వర్గం యొక్క పనులను ఇంచార్జ్ లు చెయ్యడం అనేది చాలా తప్పు. ఈ విషయం అచ్చెన్న ఉద్యమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ అచ్చెన్న ఉద్యమానికి శ్రీకారం తలపెడితే వైసీపీ రాజకీయంగా దెబ్బపడటం ఖాయంగా కనిపిస్తుంది.