ఏపీ రాజకీయాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరు. ఎన్నికల కమిషినర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ కుమార్ ఈ మధ్య నిత్యం ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను కోవిడ్ కారణంగా నిమ్మగడ్డ నిలిపివేసినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి రమేష్ కుమార్ నిత్యం ఎదో ఒక ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది. మార్చిలో వాయిదా వేసిన ఎన్నికలను ఇప్పుడు నిర్వహించనికి సిద్ధమైన రమేష్ కు వైసీపీ ప్రభుత్వం సహకరించడం లేదు.దీనిపై ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఢిల్లీ నుండి పిలుపు అందుకున్న రమేష్
స్థానిక ఎన్నికల నిర్వహణకు తనకు స్థానిక ప్రభుత్వం, ప్రభుత్వం అధికారులు సహకరించడం లేదని నిమ్మగడ్డ ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఇదే విషయంపై చర్చించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి రమేష్ కుమార్ కు పిలుపువచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. మార్చి లో ఎన్నికలు వాయిదా వేసిన తరువాత తాను ఎదుర్కొన్న పరిణామాలపై విచారణ చేయనున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ తరువాత వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రమేష్ నిజంగా తప్పు చేశారా!!
రమేష్ కుమార్ పై వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ కోపం చూపిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ రమేష్ ను దూషిస్తూనే ఉన్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ నిజంగా వైసీపీ నాయకులకు కోపం తెప్పించే పని చేశాడా అంటే లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కోవిడ్ కారణంగా రమేష్ ఎన్నికలను వాయిదా వేసి మంచి పని చేశారని లేదంటే రాష్ట్రంలో కరోనా ఇంకా వేగంగా వ్యాపించెదని చెప్తున్నారు. వైసీపీ నాయకుల కోపంలో రాజకీయ లబ్ది తప్పితే ప్రజా సంక్షేమం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.