వైసీపీలో ఉన్న కీలక నేతల్లో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున నగరిలో విజయం సాదించింది అలాగే 2019 ఎన్నికల్లోనూ నగరిలో వైసీపీ తరపున విజయ పతాకం ఎగురవేసింది. అయితే రెండు సార్లు విజయం సాధించిన రోజాకు జగన్ క్యాబినెట్ లో స్థానం లభిస్తుందని అందరు అనుకున్నారు కానీ రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు వల్ల సాధ్యం కాలేదు. కానీ రోజాకు మాత్రం క్యాబినెట్ స్థానంపై చాలా ఆశలు ఉన్నాయి.
క్యాబినెట్ పదవిపై ఆశపడ్డ రోజాకు చివరికి జగన్ ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే రోజా మాత్రం పార్టీ తనకు అన్యాయం చేసిందని తన అనుచరులతో చెప్తూనే ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో జరగనున్న క్యాబినెట్ మార్పుల్లో అయిన తనకు క్యాబినెట్ లో స్థానం ఇవ్వాలని రోజా రోజు పూజలు కూడా చేస్తుందట. సినీ రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి అదే ఫీల్డ్ లోనే ప్రస్తుతం మరో పదవి ఇవ్వనున్నట్టు సమాచారం .
కరోనా కారణంగా ఫిల్మ్ షూటింగ్స్ కు చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి వైసీపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫిల్మ్ షూటింగ్ కమిటీ యొక్క చైర్మన్ పదవి రోజాకు దక్కనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్న రోజాకు మళ్ళీ ఈ పదవి కూడా ఇవ్వడం వైసీపీలో ఉన్న చాలామంది నేతలకు నచ్చడం లేదని రాజాకీయ వర్గాలు చర్చించునుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా రానున్న రోజుల్లో జగన్ క్యాబినెట్ లో స్థానం దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.