రేవంత్ కి పి‌సి‌సి పదవి : సోనియా సంచలన ప్రకటన ?

revanth reddy satires on congress party leaders

తెలంగాణాలో కాంగ్రెస్ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందొ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను అడ్డుకునే పార్టీగా, కేసీఆర్ కు చెక్ పెట్టె పార్టీగా ఉన్న కాంగ్రెస్ దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు కనీసం పట్టించుకోలేదు. మొన్న దుబ్బాకలో ఉప ఎన్నికల జరగడానికి ముందు వరకు తెలంగాణలో పోటీ ఎప్పటికైనా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే అనుకున్నారు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ కు చెక్ పెట్టెది బీజేపీనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఇలా దెబ్బతినడానికి కూడా కాంగ్రెస్ నేతలే కారణమని చెప్తున్నారు.

revanth reddy
revanth reddy

వాళ్లను వాళ్లే తొక్కేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు

ఒక పార్టీలో ఉన్న నేతలను మరో పార్టీలో ఉన్న నేతలు సహజంగా తొక్కేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం సొంత పార్టీ నేత ఎదుగుతున్న తట్టుకోలేక వాళ్లను వాళ్లే తొక్కేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు పార్టీ కోసం కంటే కూడా సొంత ప్రయోజనాల కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలమని చెప్పుకుంటున్నారు కానీ పార్టీ కోసం మాత్రం పని చెయ్యరు, చేసే వాళ్ళను కూడా తొక్కేస్తున్నారు. అలా తొక్కబడిన వాళ్లలో రేవంత్ రెడ్డి ఒకరు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడటానికి రేవంత్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కానీ సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు.

రేవంత్ కు పట్టం కట్టనున్న సోనియా

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది కానీ ఇక్కడ ఉన్న స్థానిక సీనియర్ నాయకులే అందుకు అడ్డుపడుతూ వచ్చారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను చూసిన కాంగ్రెస్ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి సిద్ధమయ్యారని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పరుగులు పెట్టడం ఖాయం. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.