రంగుల ప్రపంచంలో(వెండితెర) ఎక్కువగా విలన్ వేషాలు వేసే ప్రముఖ నటుడు సోనూసూద్, నిజమైన ప్రపంచంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీల ఆకలి తీర్చడమే కాకుండా తన సొంత ఖర్చుతో, వారిని స్వస్థలాలకు చేర్చేందుకు, సోనూసూద్ చేసిన కృషి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా నెటిజన్లు సోషల్ మీడియా సోనూ రియల్ హీరో అంటూ కొనియాడారు.
అయితే ఇప్పుడు మరోసారి సోనూసూద్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. దేశం నలు మూలల నుండి కష్టం అని ఎవరు నోరు తెరిచి అడిగినా తనవంతుగా సాయం అందిస్తున్న సోనూసూద్, ఈసారి ఓ రైతు కుటుంబం పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు తన పొలంలో దున్నడానికి ఎద్దులు దొరక్కపోవడంతో, ఆ తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలతో కాడి పట్టించి పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ వీడియో సోనూ సూద్ కంటపడడంతో వెంటనే స్పందించాడు. ఈ క్రమంలో తొలుత ఎద్దులు కొనిస్తానని చెప్పిన సోనూ, ఆ తర్వాత ఆ కుటుంబానికి కావాల్సింది ఎద్దులు కాదని, ట్రాక్టర్ అని, అందుకే వారికి ట్రాక్టర్ పంపుతున్నట్టు తెలిపాడు. దీంతో ఆ ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవాలని కోరుతూ సోనూ ట్వీట్ చేశారు. దీంతో సోనూ సూద్ తన పెద్ద మనసుతో మరో పేద కుటుంబాన్ని ఆదుకునందుకు ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి దేశ వ్యాప్తంగా సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఈ విలన్ మంచి మనసుకు చేతులెత్తి మొక్కాల్సిందేనని అంటున్నారు.
This family doesn’t deserve a pair of ox 🐂..
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD— sonu sood (@SonuSood) July 26, 2020