Sonu Sood: రాజకీయాల్లోకి వస్తా : సోను సూద్

Sonu Sood: సోనుసూద్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి. ఎంతోమంది జనాలు దేవుడిగా భావించే వ్యక్తి సోనూసూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచిన వ్యక్తి సోనుసూద్. నోరు తెరిచి సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా తనకు తోచిన విధంగా సహాయం చేసి రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నారు. ఇక సోనూసూద్ నెటిజెన్స్ కలియుగ కర్ణుడు అనే బిరుదు కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా సోనూసూద్ విగ్రహానికి పూజలు కూడా నిర్వహించారు.

ఇలా ఎంతోమందికి దానధర్మాలు చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ మరో ఐదేళ్ళ పాటు సమాజ సేవ చేసి, అనంతరం రాజకీయాల్లోకి వస్తానని సోనుసూద్ వెల్లడించారు. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని సోను సూద్
చెప్పుకొచ్చారు. ఆ పదవికి నువ్వే అర్హుడు అని అందరూ అనే స్థాయికి ఎదిగిన తర్వాత తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని సోను సూద్ తెలిపారు. ఇకపోతే పంజాబ్ లో కాంగ్రెస్ కు ఎక్కువగా విజయఅవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సోదరి మాళవిక కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు సోనుసూద్. ఇకపోతే సోనుసూద్ పేరు ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సోనూసూద్ వైపే చూసేవారు. కరుణా విపత్కర పరిస్థితుల్లో కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా సోనూసూద్ వైపే చూసారు. సోను సూద్ ద్వారా లక్షలాది మంది సహాయం పొందారు. కరోనా సమయంలో సోనూసూద్ చెప్పు చేసిన సేవలు, సహాయాలు ఎంత చెప్పినా తక్కువే. ఇక సోనుసూద్ చేసిన పనికి సామాన్యుడి నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా చెప్పాలి కరోనా సమయంలో ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేర్చినందుకు ఆ ప్రజలు సోనూసూద్ ఫోటోకి పూజలు సైతం నిర్వహించారు. మొత్తానికి సోనుసూద్ జనంలోకి వెళ్ళారు.