తక్కెడ రాజకీయాలు : పవన్ మిత్రుడి నుండి గమ్మతైనా వ్యాఖ్యలు

Somu-Veerraju

 ఆంధ్రప్రదేశ్ కి ప్రాణాధారమైన పోలవరం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు అయినా కానీ ఆంధ్ర ప్రజలు కావచ్చు, నేతలు కావచ్చు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, దానినే అలుసుగా తీసుకోని ఇప్పుడు పోలవరం విషయంలో శనగలు తినేసి చేతులు కడుక్కోవాలి అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటం ముమ్మాటికీ తప్పే.

somu veerraju

 ఇక పోలవరం విషయంలో కేంద్రం నిర్ణయం పై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ, కొన్ని గమ్మతైనా వ్యాఖ్యలు చేశాడు, ఆంధ్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సృష్టమైన ఆలోచనతో ఉన్నట్లు, అమరావతి విషయంలో అప్పట్లో టీడీపీ ఇప్పుడు వైసీపీ లు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని, బీజేపీ మాత్రం ఈ విషయంలో ఒకే నిర్ణయం మీద ఉందని రాజధాని అమరావతిలోనే ఉండాలని, రైతులకు న్యాయం చేయాలనీ, మిగతా పార్టీల మాదిరి మేము తక్కెడ రాజకీయాలు చేయమని చెప్పుకొచ్చాడు పవన్ మిత్రుడు సోము వీర్రాజు.

 నిజానికి తక్కెడ రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో సొంతగా ఎదిగే బలం లేకపోవటంతో, టీడీపీని ఒక పక్క, వైసీపీని మరోపక్క తక్కెడ లో వేసి, తూకం వేసుకుంటూ ఎవరి వైపు మొగ్గు చూపితే బాగుంటుందో అని లెక్కలు కట్టి మరి అందుకు తగ్గ రాజకీయం చేస్తుంది మీరు కదా..? రాష్ట్రంలో టీడీపీ పార్టీ నిలబడితే బీజేపీ ఎదగలేదని భావించి ప్రతిపక్షమైన టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతుంది మీరు కదా..? మరో పక్క రాష్ట్రంలో జగన్ బలమైన నేతగా ఎదిగితే తమకి ఎక్కడ పుట్టగతులు ఉండవేమో అనే భయంతో పోలవరం విషయంలో ముందరి కళ్ళకు బంధం వేస్తుంది మీరు కదా..? ఇవన్నీ మర్చిపోయి ఆంధ్ర ప్రదేశ్ విషయంలో సృష్టమైన వైఖరితో వున్నాం, తక్కెడ రాజకీయాలు చేసే అలవాటు మాకు లేదంటే నమ్మటానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరనే విషయం సోము వీర్రాజు అర్ధం చేసుకుంటే మంచింది.