ఏ కులానికి ఆ కుల క్వారంటైన్ సెంటర్ సచ్చిపోండి రా మీరు!

Politacl Latest Updates In telugu rajyam

రాజకీయాల్లో కులాలు, మతాల ప్రస్తావన లేకుండా ఏ పని జరగదు. రాజకీయాల్లో ఎదగాలంటే కూడా నాయకుడికి తన సామాజిక వర్గం మద్దతు ఉండాలి. కులాల,మతాల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా ఒక్క మాట మాట్లాడలేరు. మన దేశంలో ప్రజలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు అందరూ కుల గజ్జితో కొట్టుకుంటున్నారు.
ప్రతిపక్ష పార్టీల నేతలకు అర్థమవుతోందా..?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ కుల రాజకీయాలు ఎక్కువైయ్యాయి. ఇప్పటివరకు మనం మతం, కులం పేరిట మ్యారేజి బ్యూరోలు, సత్రాలు ఉండటం, ఇంకా నాయకులు కులాల పేరిట సిగ్గు లేకుండా ఓట్లు అడగటం కూడా చూసాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కులాల పేరిట క్వరంటైన్ సెంటర్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వం వైఫల్యం వల్ల క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, కొన్నిచోట్ల నాసిరకం భోజనం అందజేస్తుండటంతో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కులాలవారీగా క్వారంటైన్ సెంటర్లు పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. పలు కులాలవారు తమ కులం పేరుతో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. చాలా జిల్లాల్లో ఈ ఒరవడి కొత్తగా మొదలైంది. ఆయా క్వారంటైన్ సెంటర్లలో ఆ కులానికి సంబంధించినవారిని మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ తెలిసో తెలియక ఇతర కులాలవారు ఎవరైనా అక్కడకు వస్తే బెడ్లు ఖాళీ లేవని, ఆక్సిజన్ సిలిండర్లు లేవని చెప్పి తప్పించుకుంటారని తెలుస్తోంది. నిజానికి ఈ కులంవారీ క్వారంటైన్ సెంటర్ కాన్సెప్టు మనది కాదట. ఉత్తర భారతదేశం నుంచి దీనిని దిగుమతి చేసుకున్నారు.

ప్రభుత్వం కరోనా బాధితులకు సరైన వసతులు కలిపిస్తే తామెందుకు ఈ కులాల పేరిట క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు.ప్రభుత్వం పట్టించుకొనప్పుడు తమ కులాల వారిని కాపాడుకోవడం కోసం ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో కూడా ప్రజలు కులాల కోసం ఆలోచిస్తున్నారని బాధపడలో లేక కనీసం కొందరికైనా వసతులు దొరికాయని సంతోశపడాలో అర్ధం కావడం లేదని సామాన్యులు భావిస్తున్నారు.