Road Accident: సమాజంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రోజుకి దాదాపుగా పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఉంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం ఒకటి ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం, మరొకటి అతివేగం. ఈ అతి వేగం కారణంగా ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తితో పాటు అవతలి వ్యక్తులు ప్రాణాలు పోతున్నాయి. నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్న కూడా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. అయితే ఈ యాక్సిడెంట్ లలో కొన్ని యాక్సిడెంట్ ల గురించి తలచుకుంటేనే ఒళ్ళు గగ్గుర్పుడుతోంది.
ఎందుకంటే ఈ వాహన ప్రమాదాలు జరిగిన సమయంలో చనిపోయిన వ్యక్తి ఎవరు అన్నది కూడా గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించాలి అని పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ అంతకంతకు ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లిలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని టిప్పర్ లారీ ఢీ కొట్టడమే కాకుండా 20 మీటర్ల పాటు ఏ మృతదేహాన్ని ఈడ్చువెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఈ దారుణమైన ఘటన జరిగింది.
కేపిహెచ్ బి రోడ్ నెంబర్ వన్ సమీపంలో గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ లారీ బైక్ ను ఢీ కొట్టడమే కాకుండా 20 మీటర్లు మృతదేహాన్ని ఈడ్చుకెళ్ళింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది అని స్థానికులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.