బ్రేకింగ్: జగన్‌ను విమర్శించిన హీరో రామ్‌కు బిగ్ షాక్

Social media people fires on hero Ram Pothineni
Social media people fires on hero Ram Pothineni
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఉన్నట్టుండి రాజకీయ వ్యవహారాల్లో వేలు పెట్టి సంచలనంగా మారాడు.  విజయవాడ స్వర్ణ ప్యాలెస్ నందు జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ప్యాలెస్ నందు కొవిడ్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు.  డాక్టర్ రమేష్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు.  డాక్టర్ రమేష్ హీరో రామ్‌కు అంకుల్ అవుతారట.  అందుకే రామ్ వ్యవహారంలో జోక్యం చేసుకుని రమేష్ కు అనుకూలంగా మాట్లాడాడు.  కావాలనే తన అంకుల్ మీద కుట్ర జరుగుతున్నట్టు మండిపడ్డాడు.  నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ట్వీట్లు చేశాడు. 
 
హోటల్ స్వర్ణ ప్యాలస్‌ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది.  అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? అని మ‌రో ట్వీట్‌లో ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్.  అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా ? అంటూ స్వర్ణ ప్యాలెస్ నేరుగా బిల్లింగ్ చేసిన రసీదులను పెట్టారు.  చివరగా పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి.  జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కు, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.  వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ వేశాడు. 
 
ఈ ట్వీట్లన్నీ చూస్తే రామ్ రమేశ్ హాస్పిటల్ యాజమాన్యానికి మద్దతిస్తూ ప్రభుత్వం చర్యలను తప్పుబడుతున్నట్టుగా ఉన్నాయి.  ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు రామ్‌కు డాక్టర్ రమేశ్ కావలసిన వ్యక్తే కావొచ్చు.  అంతమాత్రానికి పూర్తిగా అతని సైడ్ తీసుకుని అసలు హాస్పిటల్ యాజమన్యం తప్పే లేదన్నట్టు మాట్లాడటం ఏమిటి.  అసలు 10 మంది చనిపోయినప్పుడు నోరు మెదపని హీరోగారు ఇప్పుడు ఉన్నట్టుండి ట్వీట్ల రూపంలో విమర్శలు గుప్పించడం హుందాతనం కాదని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్ల నుండి భారీ మొత్తంలో ఫీజులు లాగేటప్పుడు రామ్ ఎక్కడున్నాడు అంటూ మండిపడుతున్నారు.