తెలంగాణ వరద భీభత్సానికి ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశ్యంతో సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఎవరికి తోచినంత సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ కూడ తన వంతుగా కోటి రూపాయల విరాళం అందించారు. అయితే పవన్ సహాయం విషయంలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పవన్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడ. అందుకే అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కోటి రూపాయలు ఇచ్చింది నటుడిగానా లేకపోతే రాజకీయ నాయకుడిగానా అంటున్నారు కొంతమంది.
ఎందుకంటే ఆయన త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అందుకే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలో ఎలాగైనా కేసీఆర్ మీద పైచేయి సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకుగాను ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. ముఖ్యంగా వరద భీభత్సానికి నగరం అతలాకుతలమైన అంశాన్ని పట్టుకుని కేసీఆర్ ఆరేడేళ్ల పాలనలో హైదరాబాద్ మహానగరాన్ని ఏం అభివృద్ధి చేశారు, రాష్ట్రానికి మెజారిటీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే సిటీని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు, ఆయన మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వరదలకు కొన్ని రోజుల ముందే పవన్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటన విడుదలచేశారు. దీంతో బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారం మొదలైంది. అందుకే పవన్ గ్రేటర్ ఎన్నికల్లో మైలేజ్ కోసమే కోటి విరాళం ఇచ్చారని అంటున్నారు. అందరూ ఇవ్వగా రాణి ప్రశ్నలు పవన్ ఇచ్చినప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటూ జనసైనికులు అడుగుతున్నారు. దానికి వారాల ఇవ్వదలుచుకున్న పవన్ అది ఒక సినిమా హీరోగా ఇస్తున్నారా లేకపోతే రాజకీయ నాయకుడిగానా చెప్పాలి కదా. కానీ చెప్పలేదు. అంటే ఈ విరాళంతో ఎన్నికలో లబ్ది పొందాలనే ఉద్దేశ్యం ఉన్నట్టే కదా అంటూ ప్రత్యర్థులు వాదిస్తున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం పవన్ విరాళం ఇచ్చింది ఒక వ్యక్తిగా మాత్రమే అంటూ ఆయన్ను సమర్థిస్తున్నారు.