ఆ భారీ సినిమాలో మెగాస్టార్ సోదరిగా శివగామి.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు భారీ సినిమాలు ఒకే టైం లో కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు మోహన్ రాజా చేస్తున్న “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. మలయాళ హిట్ సినిమా “లూసిఫర్” కి రీమేక్ గా దీనిని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా విషయంలో క్యాస్టింగ్ పరంగా కూడా చిత్ర బృందం చాలా హై లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పుడు ఇంకో కీలక టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ కి సోదరి పాత్రలో సీనియర్ నటి రమ్య కృష్ణ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. రమ్య కృష్ణ కి ఓ సాలిడ్ రోల్ పడితే అదెలా ఉంటుందో ఇప్పటికే బాహుబలి, నరసింహ లాంటి సినిమాల్లో చూసాం. మరి ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.