Kannappa Movie: కన్నప్ప సినిమాలో నటించడం ఇష్టం లేదు.. శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు!

Kannappa Movie: మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు పది సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడుతూ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భగమయ్యారు. ఇక ఈ సినిమాలో నటుడు శివ బాలాజీ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులో స్పెషల్ ప్రీమియర్ వేశారు దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ప్రీమియర్ చూడటం కోసం వచ్చారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటుడు శివబాలాజీ కూడా హాజరయ్యారు. ఇక ప్రీమియర్ అనంతరం ఈయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమాలో నేను మహదేవ శాస్త్రి పాత్రలో నటించిన మోహన్ బాబుకి కొడుకు పాత్రలో కనిపించబోతున్నానని తెలిపారు. ఈ సినిమాలో మోహన్ బాబు కొడుకు పాత్రలో నటించమని నన్ను అడిగినప్పుడు నేను కాస్త ఆలోచించానని శివబాలాజీ తెలిపారు.

ఈ సినిమాలో నా పాత్ర నిడివి పెద్దగా ఉండదు ఊరికనే పక్కన నిలబడే పాత్ర కావడంతో ఇదే విషయం గురించి విష్ణుతో మాట్లాడుతూ ఆ పాత్రలో ఎలా చేయాలి అంటూ అడిగాను. దీంతో విష్ణు నీ ఇష్టం అన్నారు. ఇక ఇదే విషయాన్ని నా భార్య మధుమిత తో మాట్లాడగా ఆమెకు కూడా ఈ పాత్ర నచ్చలేదు కానీ ,ఈ సినిమా ద్వారా ఒక పాన్ ఇండియా సినిమాలో భాగం కావచ్చు అనే ఉద్దేశంతోనే నటించానని శివ బాలాజీ తెలిపారు. ఇప్పుడు నాకు ఈ పాత్ర గొప్పదనం ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది ఒకవేళ చేయకపోయి ఉంటే ఒక మంచి పాత్ర మిస్ చేసుకునే వాడిని అంటూ తెలియచేశారు.ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి అంటూ సినిమా పట్ల ఎంతో గొప్పగా మాట్లాడుతూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు.