జనాలు సినిమాల హాళ్లకు రావడం చాలా వరకు తగ్గించేశారు. పెరిగిన నిత్యావసర ధరలు, కరోనా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవడం, దానికి తోడు సినిమా టికెట్ ధరలు పెరగడం వల్ల జనాలు సినిమా థియేటర్ వెళ్ళడానికి అంతగా ఆశక్తి చూపడం లేదు. కొన్నాళ్ళు ఆగితే ఓటిటి లో వొచ్చేస్తుంది లే అని ఊరుకుంటున్నారు.
సినిమా లో సరైన కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా రెండో రోజుకే వెళ్ళిపోతుంది. దీనికి ఉదాహరణ చిరంజీవి ‘ఆచార్య’. సినిమా థియేటర్ లు ఖాళీగా ఉంటున్న సమయం లో ఎవరూ ఊహించని సక్సెస్ అందుకుంది ‘సీత రామం’ సినిమా.
అంత వరకు అంతగా సక్సెస్ లేని హను రాఘవపూడి, తెలుగు లో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి కాంబినేషన్ మీద ఎవరికీ ఎలాంటి హోప్స్ లేవు. కేవలం రష్మిక మందన్న కోసం ఈ సినిమా పై కొంచెం బజ్ వచ్చింది.
అయితే రిలీజ్ అయిన మొదటి రోజునుండి ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. మరో వైపు ‘బింబిసార’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నా….’సీత రామం’ బ్లాక్బస్టర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు వర్షన్ యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది.
ఇప్పుడు ఓటీటీ విడుదలపై తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కి రానుందని తెలుస్తోంది