సీరియస్‌గా కామెడీ చేసేస్తున్న సిరి హన్మంత్

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా పరిచయం కాకముందే, యూ ట్యూబర్‌గా సిరి హన్మంత్‌కి మంచి పేరుంది. అయితే, యూ ట్యూబర్ సిరి హన్మంత్ వేరు. బిగ్ హౌస్‌లో సిరి హన్మంత్ వేరు. ఇప్పటికే తన గేమ్ తాను ఆడకుండా, షణ్ముఖ్ జశ్వంత్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందన్న వాదన ఉంది సిరికి బిగ్‌బాస్ వీక్షకుల నుంచి.

ఇక ఇప్పుడు సీరియస్‌గా తానేదో గేమ్ ఆడేస్తున్నాననుకుంటూ, సిల్లీగా కామెడీ చేసేస్తోంది. ఇది ఆమె ఇమేజ్‌ని బాగా డ్యామేజ్ చేసేస్తోందంటూ సోషల్ మీడియాలో సిరి అభిమానులే బ్లేమ్ చేస్తున్నారు. అసలెందుకిలా చేస్తోంది.? సిరి హన్మంత్. తాజా టాస్క్‌కి సంబంధించి సంచాలక్‌గా వ్యవహరిస్తున్న సిరి హన్మంత్, సన్నీతో అనవసరంగా పెట్టుకున్న గొడవే ఆమెను సిల్లీ గై లిస్టులోకి నెట్టేసింది.

తప్పేం లేకపోయినా, సన్నీతో సారీ చెప్పించుకోవడానికి సిరి చేసిన సీరియస్ కామెడీ వీక్షకుల్ని విస్తుపోయేలా చేసింది. సిరి బిహేవియర్ ఇలాగే ఉంటే, ఆమె అభిమానుల నుంచే నెగిటివిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే, ఈ వారం ఎలిమినేషన్‌లో సిరి హన్మంత్ కూడా ఉంది.