వైసీపీలో సింగిల్ హ్యాండ్ కమ్మ నేత.. డైరెక్ట్ జగన్‌తోనే 

YSRCP in dialoma with CBI notices 
రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది.  ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో కమ్మ నేతలు రాజకీయాల్లో ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉన్నారు.  ఈ సామాజికవర్గం ప్రధానంగా  తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేస్తూ వచ్చారు.  గతంలో కాంగ్రెస్ లాంటి పార్టీలో చక్రం తిప్పినా  వీరికి తెలుగుదేశంలో ఉన్నంత వెసులుబాటు మరెక్కడా లేకుండా లేదు.  ఆర్థికంగా, ఓటు బ్యాంక్ పరంగా బలమైన వర్గం కావడంతో చంద్రబాబు నాయుడు కూడ వీరికి పెద్ద పీఠ వేశారు.  పైగా సొంత సామాజికవర్గం.  కొందరు పార్టీలో, పదవుల్లో ఉండి అహ్వాయా చూపిస్తే ఇంకొందరు తెర వెనుక నుండి పెత్తనం చేశారు.  బాబుగారి గత పాలనలో వారికే  ప్రముఖంగా పదవులు దక్కాయి.  
 
Single Kamma leader in YSRCP
Single Kamma leader in YSRCP
దెందులూరు, తణుకు, చింతలపూడి, ఏలూరు, ఉంగుటూరు, నిడదవోలు లాంటి సీట్లు కమ్మలకే పరిమితం చేశారు బాబు.  అమరావతి విషయంలో కమ్మల నేతలు వివాదం ఎంత పెద్దది అయిందో అందరికీ తెలుసు.  కేబీవలం ఆ ఒక్క వర్గం కోసమే అమరావతిని నిర్మిస్తున్నారని పెద్ద రగడ చేశారు జగన్.  ప్రతిపక్షంలో  ఉండగా కమ్మ సామాజికవర్గం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు.  విమర్శలే కాదు చేతల్లో కూడ ఆ వర్గం మీద తన విముఖతకు స్పష్టంగా చూపించారు.  అన్ని పార్టీల్లో సాగినట్టు తన పార్టీలో కమ్మవర్గం డామినేషన్ లేకుండా చూసుకున్నారు.  
 
2014 ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే ఆ వర్గానికి కేటాయించారు.  గత ఎన్నికల్లో దెందులూరు సీటును కమ్మ వర్గానికి చెందిన అబ్బయ్య చౌదరికి కేటాయించారు.  ఈ ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి ఏకంగా టీడీపీ కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన చింతమనేని ప్రభాకర్ మీద గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు.  ఆ విజయం ఆయనకు పార్టీలో మంచి ప్రాముఖ్యతను కల్పించింది.  జగన్ సైతం చింతమనేనిని పడగొట్టిన నేతగా అబ్బయ్య చౌదరిని గుర్తుపెట్టుకున్నారు.  అలా వైసీపీలో కమ్మ వర్గం తరపున అధిక ప్రాధాన్యత కలిగిన ఒకే ఒక్క నేతగా అబ్బయ్య చౌదరి నిలిచారు.  ఈయనకు నేరుగా జగన్‌తోనే మాట్లాడే చనువు, వెసులుబాటు ఉన్నాయి.  అంతర్గత రాజకీయాలకు కూడ ఈయన దూరమే.  పార్టీలో కమ్మ  సామాజికవర్గం నుండి ఆయనకు అస్సలు పోటీయే లేదు.  అలా వైసీపీలో సింగిల్ కమ్మ నేతగా అబ్బయ్య చౌదరి చక్రం తిప్పుతున్నారు.