Akhanda:మనుషులకి ఒక డ్రగ్స్ అలవాటు చేసినట్టు సినిమా అలవాటు చేశారని డైరక్టర్ సాయి వెంకట్ అన్నారు. తాను ఒకవేళ ఏదైనా సినిమాకు వెళ్లాలి అనుకుంటే ఎక్కడ వెళ్ళినా ఒకే సినిమా ఉంటుందని, ఉదాహరణకు అఖండలా అని ఆయన చెప్పారు.ఈ సినిమా విడుదలైనప్పుడు అన్ని థియేటర్లలో విడుదలైంది. అప్పుడే సినిమా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమానే చూడాలని ఆయన చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మైండ్ గేమ్ అని ఆయన స్పష్టం చేశారు.
ఏదైనా ఒక సినిమా ఒక్క థియేటర్ లో రిలీజ్ అయ్యింది అంటే సినిమా దమ్ము లేదని అనుకుంటారు చాలామంది అని చెప్పారు. ఆ మైండ్ సెట్ పెట్టుకొని ఆ సినిమాకు వాడు వెళ్లడం మానేస్తాడు అని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక థియేటర్ లో సినిమా అంటే తక్కువగా చూస్తారని ఆయన తెలిపారు.
ఐతే తాము చిన్న సినిమాలకు జరుగుతున్న నష్టంపై నిరాహార దీక్ష కూడా చేశామని ఆయన అన్నారు. అప్పట్లో థియేటర్స్ కి రెంట్స్ ఇస్తేనే చిన్న సినిమాలను ఆదించేవారని, కొన్ని సమయాల్లో 2 లక్షల రూపాయల రెంట్ కడితేనే సినిమా ఆడించే పరిస్థితుల్లో, ఇది ఘోరంగా ఉందని నిరసనలు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. 2008లో తాము నిరాహార దీక్ష చేశామని, దానికి గానూ ఫైవ్ మెన్ కమిటీ వేశారని కూడా ఆయన చెప్పారు. అయితే అప్పుడు దాసరి గారు వచ్చి ఒక షో ఇస్తామని చెప్పారు, గానీ దాదాపు 13 సంవత్సాలైంది గానీ అది కేవలం జీవోలకే పరిమితమైందని ఆయన వాపోయారు. ఆ తర్వాత పర్సెంటేజ్‌ల విధానం వచ్చిందని ఆయన తెలిపారు.