నో డౌట్.. గ్రీన్ టీ తాగితే మంచిదే. చాలా మంచిది. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలు గ్రీన్ టీ తాగడం వల్ల తగ్గుతాయని పరిశోధనలో తేలింది. కాకపోతే.. మనం మరిచిపోతున్న ఒకే ఒక విషయం ఏంటంటే.. అసలు గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి అనే విషయం చాలా మందికి తెలియదు.
మన జీవితంలో గ్రీన్ టీని భాగంగా చేసుకుంటే బాగుంటుంది. కానీ.. ఎప్పుడు గ్రీన్ టీని తాగాలి. పొద్దున లేవగానే కొందరు గ్రీన్ టీని గటగటా తాగేస్తారు. అలా ఉదయం పూట ఖాళీ కడుపున గ్రీన్ టీ తాగారా? అంతే… కోరి ఎసిడిటీ సమస్యలను మీరు తెచ్చుకున్నట్టే.
గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. సుమారు 25 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అంటే ఒక రోజుకు కావాల్సిన కెఫిన్.. ఒక్క గ్లాస్ గ్రీన్ టీతో వచ్చేస్తుంది. కానీ.. రోజూ నాలుగైదు గ్రీన్ టీలు తాగేస్తే మాత్రం శరీరంలో కెఫిన్ శాతం ఎక్కువవుతుంది. అది శరీరానికి ఎంతో చెడు చేస్తుంది. దాని వల్ల నిద్ర పట్టకపోవడం, నీరసంగా అనిపించడం, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి.
గ్రీన్ టీని రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఐరన్ కూడా శరీరంలో తగ్గిపోతుందట. ఐరన్ తగ్గడం వల్ల లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగితే.. ఖచ్చితంగా ఐరన్ ఎక్కువ ఉన్న వేరే ఫుడ్ తినాల్సిందే. అప్పుడే శరీరంలో ఐరన్ బ్యాలెన్స్ అవుతుంది.
ఇది చాలా ముఖ్యమైంది… చాలామంది తరుచుగా ట్యాబ్లెట్లు తీసుకుంటుంటారు.. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. లేకపోతే… బీపీ పెరగడంతో పాటు.. నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు, పిల్లలు గ్రీన్ టీ తాగకపోవడమే బెటర్. గ్రీన్ టీ మోతాదు మించితే… ఎముకలు తమ గట్టిదనాన్ని కోల్పోతాయి.
చూశారా… గ్రీన్ టీ శరీరానికి మంచిదే కానీ.. మోతాదు మించినా.. సరైన సమయంలో తాగకపోతే చాలా సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.