Shyamala: కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు దాడులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు వైకాపా ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుపతి ఇన్చార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ పై తాజాగా లక్ష్మీ అనే మహిళ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా కిరణ్ రాయల్ వార్తలలో నిలిచారు అయితే ఈయన గురించి వస్తున్నటువంటి ఈ ఆరోపణలపై ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ కిరణ్ రాయల్ కొద్ది రోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలను కూడా జారీ చేశారు .
ఈ క్రమంలోనే కిరణ్ రాయల్ వ్యవహారంపై యాంకర్ శ్యామల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో ఆడపిల్లలకు ఎంతో మంచి రక్షణ ఉండేది దిశా యాప్ ద్వారా మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కాదు అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ నేను అధికారంలోకి వస్తే మహిళల గురించి అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తా అంటూ అప్పట్లో ప్రగల్బాలు పలికారు.
ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పెద్దవారు ముసలివారు అని తేడా లేకుండా అందరిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల వెల్లడించారు.జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసిన పట్టించుకునే వారు లేరు అంటూ ఫైర్ అయ్యారు.
సొంత పార్టీ కార్యకర్తలే మహిళలపై ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ శ్యామల ప్రశ్నించారు.తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు. కానీ ప్రస్తుతం తప్పు చేసిన వారు కూడా కాలర్ ఎగరేసుకొని మరి మాట్లాడుతున్నారు అంటూ శ్యామల కిరణ్ రాయల్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
