Shyamala: భాను ప్రకాష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన శ్యామల… మహిళలోకం తలదించుకునేలా అంటూ?

Shyamala: నగిరి టిడిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇటీవల వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇలా ఒక మాజీ మహిళా మంత్రి గురించి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఘాటుగా స్పందించారు. భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉన్నాయని, సభ్య సమాజానికి అవమానకరమని మండిపడ్డారు. మహిళా మాజీ మంత్రిని అవమానించిన ఎమ్మెల్యేపై చట్టపరమైన, రాజకీయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ఓ కార్యక్రమంలో భాగంగా భాను ప్రకాష్ రోజా గురించి మాట్లాడుతూ..మాజీ మంత్రిరోజా అధికారం ఉందనే అహంకారంతో ఎంతోమందిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా అందరినీ మోసం చేసి కోట్లు సంపాదించింది.కోట్లు వెనకేసుకుంది. అంతేకాదు రోజా 2000 ఇస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధం..ఎలాంటి పని అయినా సరే చేసేస్తుంది అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈయన చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపట్ల రోజా ఘాటుగా స్పందించారు.ఈ గాలి గాడు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడుతూనే.. మహిళను కించపరిచేలా ఇలా ప్రచారం చేయడం ఏమాత్రం బాగోలేదు. వ్యాంపుకు ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అంటూ నా గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాదు దీనికి పిచ్చెక్కిందా లేక దీని మాటలు పట్టుకుని వీళ్ళ నాయకుడికి పిచ్చెక్కిందా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మాటలు సహించేది లేదు. ఆడవాళ్ళపై ఇలాంటి దారుణాలు ప్రశ్నించినందుకే భాను ప్రకాష్ ఇలాంటి మాటలు మాట్లాడారు అంటూ ఈమె పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసి తీవ్రస్థాయిలో అతని వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఈ విషయం కాస్త వివాదాస్పదంగా మారింది.