Samantha – Raj: సమంత – రాజ్ రూమర్స్.. దర్శకుడి భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సినీ పరిశ్రమలో స్టార్‌ నటీమణుల ప్రైవేట్ జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా నటి సమంత పేరు మరో వివాదానికి కేంద్రంగా మారింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితతపై సోషల్ మీడియాలో తలెత్తిన ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ భార్య శ్యామాలి చేసిన భావోద్వేగ పోస్ట్‌ ఈ వ్యవహారానికి మరో మలుపు తీసుకొచ్చింది.

“నా గురించి మాట్లాడేవారికి.. నా క్షేమం గురించి ఆలోచించే వారికి నా ప్రేమ..ఆశీస్సులు ” అంటూ శ్యామాలి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సందేశం ఎవరిని ఉద్దేశించిందో స్పష్టంగా చెప్పకపోయినా… సమంతతో రాజ్ మధ్య నడుస్తున్న ప్రాజెక్ట్ పూర్వపు పరిచయం, తరచూ కలిసి కనిపించడంపై చర్చలకు కారణమైంది. ‘శుభం’ చిత్రం విజయం నేపథ్యంలో దిగిన ఫోటోలను సమంత పంచుకోవడం, వెంటనే శ్యామాలి నుంచి భావనలతో నిండిన పోస్టు రావడం ఉద్దేశపూర్వకమా? లేదా యాదృచ్ఛికమా? అనే అనుమానాలను నెట్టింట్లో పెంచింది.

పాత రోజులలో బాగా కనిపించే గాసిప్ కథలే కొత్త రూపంలో ఫీడ్ అవుతున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నా, శ్యామాలి పోస్ట్ సమయం, కంటెంట్ అనేది సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. రాజ్-డీకే దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ మాన్ 2’తో సమంతకు వెబ్ వరల్డ్‌లో పెద్ద బ్రేక్ దక్కింది. అదే కాంబినేషన్‌లో ఆమె ‘సిటడెల్: హనీ బన్నీ’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వర్కింగ్ రిలేషన్‌షిప్ లో వారు కలిసి దిగిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో సరైన క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.