కరోనా సెకండ్ వేవ్ భీభత్సానికి తెలుగు ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపుగా ఆగిపోయాయి. ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని చిత్రాలు ఏ స్టేజిలో ఉంటే ఆ స్టేజిలో నిలిచిపోయాయి. ధైర్యం చేసి షూటింగ్స్ చేస్తున్న హీరోలు కూడ బెంబేలెత్తిపోయారు. కేసులు పెరుగుతున్నా షూటింగ్ కంప్లీట్ చేయాలనే తపనలో చిత్రీకరణ జరిపిన సినిమాల్లో ‘పుష్ప’ కూడ ఒకటి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న టీమ్ కరోనా తమ వరకు రాదనే అనుకుంది. కానీ ఏకంగా అల్లు అర్జున్ వైరస్ బారినపడటంతో కళ్ళు తెరిచి ప్యాకప్ చెప్పుకున్నారు.
‘పుష్ప’ టీమ్ మాదిరిగానే ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర బృందం కూడ షూటింగ్ చేసింది. సుమారు 6 కోట్లు వెచ్చించి హైదరాబాద్ శివార్లలో కలకత్తా సెట్ వేశారు. సెట్ పూర్తయ్యాక కోవిడ్ కేసులో పెరగడం మొదలైంది. ఇంత ఖర్చు చేసి సెట్ వేశాక ఇప్పుడు షూటింగ్ ఆపివేయడం అంటే భారం తప్పదని, పైగా వర్షాలు కురిసే సీజన్ కావడంతో సెట్ వృథా అవుతుందని భావించిన నిర్మాతలు షూటింగ్ చేయడానికి మొగ్గుచూపారు. నాని సైతం ఇతర సినిమాలను ఆపేసినా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ వచ్చారు. కానీ వారికి కూడ ‘పుష్ప’ బృందానికి తగిలిన షాకే తగిలిందట. టీమ్ సభ్యుల్లో కొందరికి వైరస్ సోకడంతో అందరూ ఐసొలేషన్లోకి వెళ్లారట. దీంతో షూటింగ్ నిలిచిపోయిందట.