నార్త్, సౌత్ సినిమాల మద్య వ్యత్యాసం పై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. “అనగనగా ఒక ధీరుడు” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు తెలుగులో నటించిన గబ్బర్ సింగ్, రేసుగుర్రం, బలుపు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమాలు చేస్తు మంచి ఫామ్ లో ఉన్న శృతి హాసన్ కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

ఇటీవల మళ్ళీ ఇండస్ట్రీకి రి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వకీల్ సాబ్, క్రాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్బికె107 సినిమాలో కూడా బాలకృష్ణ సరసన నటిస్తోంది. సలార్ సినిమా షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కి వచ్చిన ఈ అమ్మడు ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ నార్త్, సౌత్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో శృతిహాసన్ మాట్లాడుతూ.. నేను నార్త్ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన దానిని. మా ఇంట్లో అమ్మానాన్న ఇద్దరు రెండు పరిశ్రమలలోను పనిచేయడం వల్ల నేను వారిని చూస్తూ పెరిగాను అంటూ చెప్పుకొచ్చింది. నా దృష్టిలో కలకు భాష లేదు. నాకు సాంబార్ రైస్ ఎంత ఇష్టమో..దాల్ చావల్ కూడా అంతే ఇష్టం. నేను విదేశాలలో ఉన్నప్పుడు భారతీయ సినిమాల గురించి గొప్పగా చెబితే అందరు అవును అనేవారు. కానీ ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీ ని నార్త్,సౌత్ అని విభజించటం నచ్చలేదు..అంటూ చెప్పుకొచ్చింది.